కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీ నుంచి గవర్నర్ గా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో, గవర్నర్ పదవి కోసం తమ పార్టీ నేతను చంద్రబాబు ఎంపిక చేయాల్సి ఉంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఛాయిస్ రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఉన్నారు. కాగా, తాజాగా మరో సీనియర్ నేత వర్ల రామయ్య పేరు తెర మీదకు వచ్చింది. అశోక్ గజపతి రాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా..ఆర్దిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతి రాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పని చేసారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఇద్దరి కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే విధంగా వర్ల రామయ్య పేరు పైనా చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు విషయంలో చివరి వరకు వర్ల రామయ్య పేరు తెర మీద ఉండటం..చివరి నిమిషంలో మరొకరికి దక్కటం జరిగింది. దీంతో, వర్ల రామయ్య కు ఎంత వరకు ఛాన్స్ ఉంటుందనేది తేలాల్సి ఉంది.
0 Comments