తెలంగాణలోని వరంగల్ నగర శివారులో బెస్తం చెరువు స్మశాన వాటికలో అఘోరి పూజలు చేసింది. దాదాపు రెండు రోజులు స్మశానంలోనే వుండి విచిత్ర పూజలు చేసింది. అందులో భాగంగా కోడిని బలిచ్చింది. దీంతో అది చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయంపై కరీంనగర్ జిల్లాకు చెందిన లా విద్యార్థులు కసిరెడ్డి రోహన్ రెడ్డి, సౌమిత్ పటేల్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని మామునూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బహిరంగంగా కోడిని బలివ్వడం నేరమని, దీనిపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు అఘోరీపై కేసు నమోదు చేశారు. 325 బీఎన్ఎస్, 11(1)(A) PCAA కింద కేసు నమోదు చేశారు. దీనిపై పిటిషనర్ రోహన్ రెడ్డి మాట్లాడుతూ అఘోరికి పోలీసులు ఎఫ్ఐఆర్ అందజేయడంతో పాటు బెయిల్ కూడా మంజూరు చేయరని అన్నా రు. అంతేకాకుండా 2 నెలల్లోపు ఛార్జ్ షీట్ నమోదు చేస్తారని అన్నారు. ఇందులో భాగంగానే కేసు నిరూపణ అయితే అఘోరీకి ఒక్క రోజు నుంచి దాదాపు 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో అఘోరీపై కేసు నమోదు !
November 27, 2024
0
Tags