రాజ్యసభకు సినీ నటుడు నాగబాబు ఎంపిక ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయటంతో ఈ మూడు స్థానాలు దక్కేదెవరికనే చర్చ మొదలైంది. తొలి నుంచి కూటమిలో ఉన్న మూడు పార్టీలకు మూడు స్థానాలు పంచుకుంటాయని అంచనాలు ఉన్నాయి. జనసేన నుంచి సినీ నటుడు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. గత ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తొలుత భావించినా బీజేపీ అభ్యర్ధనతో ఆ సీటు సీఎం రమేశ్ కు కేటాయించారు. దీంతో, నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించారు. అయితే, ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో బీదా మస్తాన రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయటం ఖాయమైంది. ఆ హామీతోనే మస్తాన రావు వైసీపీకి రాజీనామా చేసారు. మూడు స్థానాల్లో బీసీలకు ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో, బీదా మస్తాన రావుకు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయదేవ్ అభ్యర్దిత్వం పైన పవన్ సైతం అంగీకారం తెలిపారని సమాచారం. ఇదే స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నారు. అదే విధంగా సానా సతీశ్ పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది. అటు టీడీపీ, జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీశ్ కు మద్దతు లభిస్తోంది. దీంతో, నాగబాబు లేదా సానా సతీశ్ లో ఒకరు జనసేన కోటాలో ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. సానా సతీశ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్యుల నుంచి కీలక వర్తమానం అందినట్లు సమాచారం. బీజేపీ నుంచి తొలుత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. అయితే, ఢిల్లీ నేతలు తాజాగా కేంద్ర మంత్రివర్గం లోని ఒక నేత పేరు సూచించినట్లు సమాచారం. రాజ్యసభ కాలపరిమితి ముగియనున్న ఆ మంత్రి కి ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు, పవన్ సైతం ఆమోదం తెలిపారు. దీంతో, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ లేదా కంభంపాటి రామ్మోహన్ లో ఒకరికి, అదే విధంగా జనసేన నుంచి సానా సతీశ్..చివరి నిమిషంలో సమీకరణాలు మారితే నాగబాబు పేర్లు ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default