మురిపిండి మొక్క ఆకులు - కీళ్ల నొప్పులు !


మురిపిండి ఒక రకమైన ఔషధ మొక్క. మురిపిండిని మగబీర, కుప్పింట, హరిత మంజరి అని కూడా అంటారు. ఎకలైఫా ఇండిక జాతికి చెందిన మొక్క ఇది. ప్రస్తుత కాలంలో వయసుతో తేడా లేకుండా ఆడ మగ ప్రతి వారు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు వచ్చాయి అంటే ఒక విధంగా వారి బాధ నరకప్రాయం అని చెప్పుకోవాలి. అలాంటి వారి కోసం ఈ మురిపిండి ఆకు మొక్క నొప్పులు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు అనేవి మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నొప్పులు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు మరియు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వస్తే ఈ రోజుల్లో మనం ఏమి ఆలోచించకుండా ఆస్పత్రులకు వెళ్తున్నాం. కానీ మన పూర్వీకులు మాత్రం నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఈ మురిపిండి మొక్కను వాడేవారు. కీళ్ల నొప్పులు తగ్గించడానికి మురిపిండి ఆకుతో ఏ విధంగా ఔషధాన్ని తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఈ మురిపిండి మొక్క ఆకులు తెచ్చుకొని బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత దానిని పొడి లాగా తయారు చేసుకోవాలి. ఆ పొడిని ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని ఆర గ్లాస్ అయ్యేవరకు బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిని వడగట్టి అందులో నాలుగు స్పూన్ల అల్లం రసం కలుపుకొని దానిని రోజూ సేవిస్తూ ఉండాలి. ఇలా రోజూ తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గుముఖం పడతాయి.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం