డీజీపీ, ఐజీపీ సదస్సుకు అంతరాయం కలిగిస్తామని ఖలిస్థానీ టెర్రరిస్ట్ పన్నూన్ బెదిరింపు !


డిశా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు డీజీపీ-ఐజీపీ సదస్సు జరుగనున్నది. ఈ సదస్సుకు అంతరాయం కలిగిస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరించాడు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులు పాల్గొనే ఈ సదస్సును లక్ష్యంగా చేసుకుంటామని నిషేధిత సిక్స్‌ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడైన ఆ ఉగ్రవాది వీడియో ద్వారా హెచ్చరించాడు.  కాగా, ఖలిస్థానీ టెర్రరిస్ట్ పన్నూన్ బెదిరింపు నేపథ్యంలో భువనేశ్వర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. డైరెక్టర్ జనరల్స్/ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్-2024కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, క్విక్ రియాక్షన్ టీమ్స్‌తోపాటు విధ్వంస నిరోధక తనిఖీ బృందాలను మోహరించారు. భువనేశ్వర్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌, బ్లాకింగ్‌లను ముమ్మరం చేశారు. సీసీటీవీ, మానవ నిఘా బృందాలతో నగరంలోని భద్రతను పర్యవేక్షిస్తున్నారు.


Post a Comment

0 Comments