హిమాచల్ ప్రదేశ్లోని కులుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్లో శివుని ఆలయం ఉంది. ఇది హిందూ, సిక్కు మతాలకు సంబంధించిన చారిత్రాత్మకమైన ప్రదేశం. పార్వతి నది మణికర్ణ గుండా ప్రవహిస్తుంది. దీనికి ఒక వైపు శివాలయం, మరొక వైపు మణికర్ణ సాహిబ్ అని పిలువబడే గురు నానక్ కి చెందిన చారిత్రక గురుద్వారా ఉంది. ఇక్కడ వేడి నీరు ఇప్పటికీ ఒక రహస్యం. ఈ రహస్యంపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. అయినా రహస్యం తెలుసుకోలేకపోయారు. ఈ శివాలయానికి సంబంధించిన కథ చాలా ప్రాచుర్యం పొందింది. పురాణ కథ ప్రకారం ఒకసారి నదిలో పార్వతీదేవి జలాకాలాడుతుండగా అమ్మవారి చెవిపోగు ముత్యం నీటిలో పడిపోయింది. ప్రవహిస్తున్న నది నీటి నుంచి ఆ ముత్యం భూలోకం నుంచి పాతాళానికి చేరుకుంది. ఆ తర్వాత శివుడు తన గణాలను ఆ ముత్యం కోసం వెతకడానికి పంపాడు. ఎక్కడ ఎంత వెతికినా వారికి ఆ ముత్యం దొరకలేదు. దీంతో శివుడు కోపించి భయంకరమైన దూరం దాల్చి మూడో కన్ను తెరిచాడు. మహాదేవుని కోపము వలన నదిలో నీరు మరగడం మొదలైంది. ఆ నది నీరు అది నేటికీ అలా మరుగుతూనే ఉంది. శివుని ఈ భయంకరమైన రూపాన్ని చూసి నైనా దేవి ప్రత్యక్షమై పాతాళానికి వెళ్లి శేషనాగుడిని పార్వతి దేవి ముత్యాన్ని శివునికి తిరిగి ఇవ్వమని కోరింది. ఆ తర్వాత శేషుడు పార్వతిదేవి ముత్యాన్ని మహ దేవుడికి తిరిగి ఇచ్చాడు. శేషుడు పాతాళంలో బిగ్గరగా బుసలు కొట్టాడు. అప్పుడు అనేక రత్నాలు భూమిపైన వివిధ ప్రదేశాలలో పడ్డాయి. అప్పుడు పార్వతీ దేవికి సంబంధించిన రత్నాన్ని తీసుకుని.. శివుడు ఆ రత్నాలన్నింటినీ రాళ్ళుగా మార్చి నదిలో విసిరాడు. ఒకవైపు పార్వతి నదిలో గడ్డకట్టే నీరు, మరోవైపు మరుగుతున్న వేడి నీటి బుగ్గ ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ దైవిక దృగ్విషయం చూసిన నాస్తికుడు కూడా దేవునికి తల వంచాల్సిందే అని సందర్శకులు చెబుతారు. ఈ ఆలయ సందర్శన ప్రతి భక్తునికి మానసిక, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తుంది. శీతాకాలంలో మంచు కురుస్తుంది. వేసవిలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పురాతన కాలం నుంచి ఇక్కడ మరుగుతున్న నీటి బుగ్గలు 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఒక ఫౌంటెన్ను సృష్టించాయి. కొన్నిసార్లు ఈ నీటి బుగ్గల నుంచి విలువైన వివిధ రంగు రాళ్ళు కూడా బయటకు వస్తాయి. ఈ నీటి బుగ్గల ఉష్ణోగ్రత 65 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వెచ్చని నీటిగల కారణాన్ని అన్వేషించడంలో శాస్త్రవేత్తలు కూడా విఫలమయ్యారు. నీటిలో ఎలాంటి సల్ఫర్ ఉండదు. ఈ నీటిలో అన్నం, పప్పు, కూరగాయలు వంటి వివిధ ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. ఈ కుండంలో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్యాలు నయమవుతాయి. ఈ పవిత్ర జలంలో ఎవరు స్నానం చేస్తారో వారికి సంబంధించిన చర్మ సంబంధిత వ్యాధులు నయం అవుతాయని ప్రజలు నమ్మకం.
ఒకవైపు గడ్డకట్టే నీరు - మరోవైపు మరుగుతున్న వేడి నీటి బుగ్గ !
by Telugu Lo Computer at November 29, 2024
Labels:
bhakti
,
Himachal Pradesh
,
national
,
ఒకవైపు గడ్డకట్టే నీరు - మరోవైపు మరుగుతున్న వేడి నీటి బుగ్గ
,
పార్వతి నది
,
మణికరణ్లో శివుని ఆలయం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment