ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రద్దు !


ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 29వ తేదీన విశాఖ నగరంలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా అక్కడ రోడ్ షో లోనూ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొనాల్సి ఉండగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజా తుఫాను హెచ్చరికల నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ పర్యటన రద్దయ్యింది. తుఫాను ప్రభావం కోస్తాంధ్రపై ఉండనున్న నేపధ్యంలో ఈ నెల 29వ తేదీన జరగవలసిన ఆయన పర్యటనను రద్దు చేస్తూ పీఎంఓ ఆఫీసు నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ పర్యటన కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భారీ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. కానీ అనుకోని విధంగా వాతావరణ పరిస్థితుల కారణంగా నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రద్దయ్యింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org