ఎఫ్-35 ఫైటర్ జెట్లను వ్యతిరేకిస్తూ ఎక్స్‌వేదికగా మస్క్ పోస్ట్ !
అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి మస్క్ పలు సూచనలు చేశాడు. ఆధునిక ఫైటర్ జెట్‌ల కంటే డ్రోన్‌ల వల్లనే ఎక్కువ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు డ్రోన్‌లతోనే జరుగుతాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. డ్రోన్‌ల వినియోగ కాలంలో మావన సహిత ఫైటర్ జెట్‌లను వాడటం లేదు. ఎందుకంటే అవి పైలట్‌లను చంపేస్తున్నాయి. అయినా ఇంకా కొన్ని కంపెనీలు ఎఫ్-35 వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నాయి. అయితే ఆ డిజైన్‌లు నేటి అవసరాలకు అనుగుణంగా లేవని మస్క్ రాసుకొచ్చారు. ఎఫ్-35 ఫైటర్ జెట్‌లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలు. దీనిలో అధునాతన ఫీచర్లు, రాడార్ గుర్తించకుండా ఉండే వ్యవస్థలున్నాయి. అయితే ఈ ఫైటర్ జెట్ పలు టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు రూపకల్పనలో, దాని నిర్వహణ ఖర్చుల వంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే మస్క్ ఎఫ్-35 ఫైటర్ జెట్లను వ్యతిరేకిస్తూ మస్క్ పోస్ట్ పెట్టడం విశేషం.