Ad Code

బైక్‎ ను తప్పించబోయి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు : 10 మంది మృతి


హారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి గోండియాకు వెళుతున్న ఆర్టీసీ బస్సు సడెన్ ‎గా బైక్ అడ్డు రావడంతో దానిని తప్పించబోయి బోల్తా పడింది. ఖజ్రీ గ్రామ సమీపంలో మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మారం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బస్సు రోడ్డు మధ్యలో బోల్తా పడటంతో హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహయంతో బస్సును పక్కకు తొలగించారు.


Post a Comment

0 Comments

Close Menu