ఆంధ్రప్రదేశ్ లో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును 'ఈగల్'గా మార్చడం పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు హోం మంత్రి అనిత తెలిపారు. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. భేటీలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అలాగే ఈ కమిటీల్లో స్థానికంగా ఉండే మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
0 Comments