ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపు ద్వారా టికెట్ల జారీ అంశంలో ప్రతిష్టాత్మక “స్కోచ్” అవార్డు దక్కించుకుంది. బస్సులలో డిజిటల్ పద్ధతిలో టికెట్ల జారీ అంశంలో స్కోచ్ అవార్డు వచ్చినట్టు ఏపీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ అవార్డును ఏపీఎస్‌ఆర్టీసీ ఛీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు అందుకున్నారు. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు మరియు కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టుట, ఇన్ బస్సులో డిజిటల్ టికెట్లు జారీ చేయుట, సంస్థ అన్ని బస్సులలో ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేయుట ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకుందన్నామని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఈ రోజు, ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తరపున సంస్థ చీఫ్ ఇంజినీర్ ఐటీ వై శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకోవడం జరిగిందని ఏపీఎస్‌ఆర్టీసీ తన ప్రకటనలో పేర్కొంది.
ఏపీఎస్‌ఆర్‌టీసీకి “స్కోచ్” అవార్డు !
November 30, 2024
0
Tags