ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని మీర్‌గంజ్ ప్రాంతంలో గీజర్ పేలి నవ వధువు మరణించింది. బులంద్ షహర్‌లోని కాలే కా నాగ్లా గ్రామానికి చెందిన యువతి పిపల్సనా చౌదరి గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌తో బాధిత యువతికి ఐదు రోజుల క్రితమే వివాహం జరిగింది. బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. నవంబర్ 22న ఆమె వివాహం తర్వాత అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. యువతి స్నానం చేయడానికి వెళ్లిన చాలా సేపటి కూడా బయటకు రాలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త, ఆమె బంధువులు పదేపదే పిలిచినా స్పందం రాకపోవడంతో, బాత్ రూమ్ తలుపు పగలగొట్టి చూశారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉంది. గీజర్ పేలిపోయి కనిపించింది. ఆమెని ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులు అస్పష్టంగా ఉన్నందున, పేలుడుకు గల కారణాలను గుర్తించడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
0 Comments