వితంతు పెన్షన్ పంపిణీ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో వృద్ధాప్య పెన్షన్ తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛన్ మంజూరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భర్త ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపు మరణిస్తే వెంటనే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే 15వ తేదీ నుంచి 30వ తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, అలాంటి పేదలను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.
0 Comments