Ad Code

మహీంద్రా బీఈ 6ఈ, ఎక్స్‌ఈవీ 9ఈ కార్ల ఆవిష్కరణ !


హీంద్రా అండ్‌ మహీంద్రా బీఈ 6ఈ, ఎక్స్‌ఈవీ 9ఈ పేరుతో రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఈ ఎంట్రీ లెవల్‌ వేరియంట్స్‌ ధరలు వరుసగా రూ.18.9 లక్షలు, రూ.21.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నుంచి ఈ కార్ల డెలివరీ ప్రారంభమవుతాయి. బీఈ 6ఈ ఒకసారి చార్జింగ్‌తో 682 కిలోమీటర్లు, ఎక్స్‌ఈవీ 9ఈ 656 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ రెండు కార్లూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. ఫాస్ట్ ఛార్జర్ల ద్వారా 20 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ కేవలం 20 నిమిషాల్లోనే ఎక్కనున్నాయి.ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూపే లాంటి రూఫ్‌ను కలిగి ఉంది. కనెక్టెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్), ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మెరిసే లోగో, పియానో బ్లాక్ క్లాడింగ్, సీ-పిల్లర్‌పై రియర్ డోర్ హ్యాండిల్స్, ఏరో ఇన్సర్ట్స్‌తో కూడిన 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెనా, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. కారు ఇంటీరియర్ విషయానికొస్తే ఇది పెద్ద, విలాసవంతమైన క్యాబిన్, ట్రిపుల్ స్క్రీన్ సెటప్, పెద్ద లోగోతో 2-స్పోక్ స్టీరింగ్ వీల్, రూఫ్‌ గ్లాస్‌తో కలిగి ఉంటుంది.సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే 2025 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇలో 7 ఎయిర్‌బ్యాగులు, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ సిస్టమ్ ఉన్నాయి


Post a Comment

0 Comments

Close Menu