గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ వ్యూ ఫీచర్ !
గూగుల్ ఎయిర్ వ్యూ అనే ఫీచర్ ను తీసుకు వచ్చింది. దీని ద్వారా ఆయా నగరాల అధికారులకు గాలి నాణ్యత శాతం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం సాగించవచ్చట!. ఏఐ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుందట!. గాలి నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగించే కొలమానాన్నే ఏక్యూఐ అని చెప్పవచ్చు. దీని ద్వారా ఆయా ప్రాంతాలలో గాలి పీల్చడం వల్ల కలిగే ప్రమాదాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఏక్యూఐ అనేది 0 నుంచి 500 మధ్య ఉంటుంది. దీనిలో 0 నుంచి 50 పాయింట్ల మధ్య గాలి నాణ్యత ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 51 నుంచి 100 పాయింట్ల మధ్య ఉంటే సమూహాలలో శ్వాస తీసుకోవడానికి అవస్థలు కలుగుతాయి. 101 నుంచి 200 వరకూ ఉంటే పిల్లలు, ముసలివారితో పాటు ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారికి అసౌకర్యంగా ఉంటుంది. 201 నుంచి 400 వరకూ ఉన్న నగరాలలో అనేక ఇబ్బందులు కలుగుతాయి. 401 నుంచి 500 మధ్య ఉండే ఆరోగ్య వంతులపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఇటీవల ఢిల్లీలో 491 పాయింట్ల నమోదు కావడం అక్కడ వాయ కాలుష్యాన్ని తెలియజేస్తుంది. దీంతో వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చారు. ఈ సరికొత్త ఫ్యూచర్ ద్వారా వాహన వినియోగదారులు ముందుగానే వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.