సింగపూర్లో 21 ఏళ్లుగా ఉంటున్న బాలసుబ్రమణ్యం చిదంబరం రూ. 8 కోట్లను గెలుపొందారు. జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో భాగంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ జ్యువెలరీలో 250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. చిదంబరం లిటిల్ ఇండియాలోని ఈ షాపుకు వెళ్లిన సమయంలో భార్య కోసం 6000 డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. తాను ఇంత పెద్ద లక్కీ డ్రాని గెలుచుకోవడంతో ఒక్కసారిగా కన్నీళ్లతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన నాన్నగారి వర్ధంతి రోజు ఈ వార్త తెలియడంతో మరింత సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలని, గెలిచిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు.
భార్య కోసం బంగారు గొలుసు కొని లక్కీ డ్రాలో రూ.8 కోట్లు గెలుపొందిన భారతీయుడు !
by Telugu Lo Computer at November 29, 2024
Labels:
250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు
,
international
,
national
,
భార్య కోసం బంగారు గొలుసు కొని లక్కీ డ్రాలో రూ.8 కోట్లు గెలుపొందిన భారతీయుడు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment