తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రకటన చేశారు. ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు . వరంగల్లో ఖచ్చితంగా ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు. వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుకు ఆదనంగా కొత్తగూడెం దగ్గర ఎయిర్ పోర్ట్ కు అనువైన స్థలం ఉందని సీఎం చెప్పారన్నారు. త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని అయన పేర్కొన్నారు. పెద్దపల్లిలో విమనాశ్రయం ఏర్పాటుకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారు.
0 Comments