Posts

Showing posts with the label బీదా మస్తాన రావు

రాజ్యసభకు సినీ నటుడు నాగబాబు ఎంపిక ?

Image
ఆం ధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయటంతో ఈ మూడు స్థానాలు దక్కేదెవరికనే చర్చ మొదలైంది. తొలి నుంచి కూటమిలో ఉన్న మూడు పార్టీలకు మూడు స్థానాలు పంచుకుంటాయని అంచనాలు ఉన్నాయి. జనసేన నుంచి సినీ నటుడు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. గత ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తొలుత భావించినా బీజేపీ అభ్యర్ధనతో ఆ సీటు సీఎం రమేశ్ కు కేటాయించారు. దీంతో, నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించారు. అయితే, ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో బీదా మస్తాన రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయటం ఖాయమైంది. ఆ హామీతోనే మస్తాన రావు వైసీపీకి రాజీనామా చేసారు. మూడు స్థానాల్లో బీసీలకు ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో, బీదా మస్తాన రావుకు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయదేవ్ అభ్యర్దిత్వం పైన పవన్ సైతం అంగీకారం తెలిపారని ...