Posts

Showing posts with the label గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి గ్యాస్

చపాతీ, రొట్టెలు - ఆరోగ్య సమస్యలు !

Image
చ పాతీ లేదా రొట్టెలు చాలా మంది ఆహారపట్టికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా వీటిని ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు, అయితే రోజూ అవి అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం , అన్ని రకాల ఆహారాలను మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. చపాతీల్లో అధికంగా ఉండే గ్లూటెన్ కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి గ్యాస్, పొట్ట నొప్పి, నానిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా గోధుమ పిండితో తయారుచేసిన రొట్టెలు తింటే ఫైబర్ పరిమిత మోతాదును మించి అందుకోవడం వల్ల కొన్నిసార్లు మలబద్ధకం లేదా విరేచనాల సమస్యల్ని తెచ్చిపెట్టవచ్చు. గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. రోజూ ఎక్కువ చపాతీలు తీసుకోవడం శరీరంలో అదనపు క్యాలరీలు చేరడానికి దారితీస్తుంది. రాత్రి సమయంలో చపాతీలను అధికంగా తింటే శరీరంలో ఎనర్జీ ఖర్చు కాకుండా కొవ్వుగా నిల్వ ఉంటుందనే ఆందోళన ఉంటుంది. చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శాతం నెమ్మదిగా పెంచుతుందని భావించినా, అధికంగా తీసుకుంటే షుగర్ స్థాయిలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ...