Posts

Showing posts with the label బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సిద్ధమా

ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని రైతులకు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి !

Image
తె లంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు మహబూబ్‌నగర్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తూ రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని అన్నారు. రుణమాఫీపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సిద్ధమా అని సవాల్ విసిరారు. రైతుల కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. రైతుల కోసం ఇంకా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గతేడాది నవంబర్‌ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని తెలిపారు. దొరల గడీలను కూల్చేందుకు ఓటర్లు తరలివచ్చిన రోజు అని చెప్పారు. రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునన్నారు. పాలమూరులో కృష్ణమ్మ పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదన్నారు. ఉపాధి కోసం ముంబై, హైదరాబాద్‌కు వలసలు పోయే పరిస్థితి ఉందన్నారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని గుర్తుచేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని ఉద్ఘాటించారు. సీనియర్లందరూ జూనియర్‌ అయినా నాకు సహకరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా అని ప్రశ్నించారు.వడ్డీతో సహా రూ.లక్ష రుణ...