తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా భవన్ లో జరిగిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లురవి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్యాదవ్, రామసహాయం రఘురామిరెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య తదితరులతో నిర్వహించిన సమావేశంలో కీలకవ్యాఖ్యలు చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి అనుమతులు నిధులు సాధించడం పైన ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలవాల,ని మూసీ నదిపునరుజ్జీవనం ఫేస్ వన్ పనులకు అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద అనుమతులు పొందాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో ఫేజ్ 2 విస్తరణపైన, ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనుల పైన అందరూ వేగంగా పని చేయాలన్నారు. వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి, బుల్లెట్ రైలు ప్రాజెక్టులపైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తుంగభద్ర, గోదావరి నీటిపంపకాలు, గోదావరి కావేరి అనుసంధానం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపైన, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలతో జరిగిన చర్చల వివరాలను ఎంపీలకు తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలను రక్షించిన కేంద్ర మంత్రులు, ప్రధాని వద్ద విజ్ఞప్తులు చేయాలని ఆయన మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించాలని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మిల్లింగ్ సామర్థ్యం, స్టోరేజ్ సమస్యలు, స్టాండింగ్ కమిటీల ద్వారా పెండింగ్ అంశాలు పరిష్కరించడం వంటి సూచనలు చేశారు
రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి ముందుకు సాగాలి !
July 14, 2026
0
Tags