అత్యాధునిక మోడల్ 'క్లాడ్' శిక్షణ : స్వామి సర్వప్రియానందతో విస్తృతంగా చర్చించిన ఆంత్రోపిక్

Saturday, October 3, 2026

Anthropic holds extensive discussions with Swami Sarvapriyananda science technology Training the state-of-the-art 'Claude' model

t f B! P L

ఏఐకి సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు ప్రపంచంలోని అగ్రగామి సంస్థలు ఆధ్యాత్మిక, తత్వశాస్త్రం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో 'ఇంటర్నెట్ యుగపు స్వామి వివేకానంద'గా పేరొందిన వేదాంత గురువు స్వామి సర్వప్రియానందను ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. తమ అత్యాధునిక మోడల్ 'క్లాడ్'కు శిక్షణ ఇచ్చే విధానాలు, సాంకేతికతలో నైతిక విలువల రూపకల్పన, భవిష్యత్తులో ఏఐ మానవుల తరహా చేతనను సాధించగలదా అనే అంశాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. సంస్థతో కుదిరిన నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ)కారణంగా సమావేశంలోని పూర్తి వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ మేధోమథనంలో సంస్థ వ్యవస్థాపకులలో ఒకరితో పాటు వివిధ మతాల ఆధ్యాత్మికవేత్తలు, మానసిక నిపుణులు, వైద్యులు పాల్గొని తమ విలువైన ఆలోచనలను అందించారని ఆయన తెలిపారు. కేవలం గణిత అల్గారిథమ్‌లు, డేటాతోనే కాకుండా మానవీయ కోణాన్ని అర్థం చేసుకునేలా ఏఐని తీర్చిదిద్దడమే ఈ సమాలోచనల అసలు ఉద్దేశం. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ