చైనాకు 2500కోట్ల Nvidia చిప్స్ సర్వర్లను అక్రమ రవాణా : ఎర్త్‌మేడ్ కంప్యూటర్ టెక్నాలజీ సీఈఓ గ్రెగ్ లుయ్ అరెస్టు

Saturday, October 3, 2026

500 Crore to China Earthmade Computer Technology CEO Greg Lui Arrested he could face a maximum prison sentence of 50 years Smuggling of Nvidia Chips and Servers Worth ₹2 technology

t f B! P L

అమెరికా ఎక్స్ పోర్ట్ రూల్స్ ఉల్లంఘించి Nvidia AI చిప్స్ సర్వర్లను అక్రమంగా చైనాకు తరలించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఓ అమెరికన్ ను అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు 300 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.2వేల500 కోట్ల విలువైన సర్వర్లను చైనాకు పంపేందుకు ప్రయత్నించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అమెరికా, చైనా మధ్య అడ్వాన్స్డ్ AI టెక్నాలజీపై తీవ్ర పోటీ ఉన్న సమయంలో ఈ కేసు వెలుగులోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలోని ఎర్త్‌మేడ్ కంప్యూటర్ అనే టెక్నాలజీ కంపెనీకి సీఈఓ అయిన  గ్రెగ్ లుయ్ ని ఈ కేసులో అమెరికన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2023 నుంచి 2024 మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే అడ్వాన్స్డ్ AI సర్వర్లను చైనాకు తరలించేందుకు లుయ్ ప్రయత్నించినట్లు అమెరికా న్యాయశాఖ (DoJ) తెలిపింది. ఇందుకోసం ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు ఆరోపించింది. అమెరికా అధికారుల తనిఖీలను తప్పించుకునేందుకు సర్వర్లను ముందుగా మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు పంపించి, అక్కడి నుంచి చైనాకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్వర్లలో Nvidia A100, H100 వంటి అత్యంత శక్తివంతమైన AI చిప్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చైనా సైనిక అవసరాలకు ఈ అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ ఉపయోగపడకుండా ఉండేందుకు అమెరికా ప్రభుత్వం వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. లుయ్‌పై అక్రమ రవాణా, మనీలాండరింగ్, అమెరికా ఎగుమతి ఎక్స్ పోర్ట్ యాక్ట్ ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదు చేశారు. ఆరోపణలు రుజువైతే గరిష్ఠంగా 50 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ