ホーム
/
technology
/
బీఎస్‌ఎన్‌ఎల్ 'ఫ్రీడమ్ 2.0' పేరుతో రూ.1కే సిమ్ : 24 రోజులు ఫ్రీ కాల్స్, 1GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు
Sunday, October 4, 2026
1GB High-Speed Data and 100 SMS/Day before October 12 BSNL Launches 'Freedom 2.0' national SIM for ₹1 with 24 Days of Free Calls technology
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు మరో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. 'ఫ్రీడమ్ 2.0' పేరుతో అందిస్తున్న ఈ ఆఫర్‌లో కేవలం రూ.1కే కొత్త సిమ్ కార్డు పొందే అవకాశం ఉంది. సిమ్‌తో 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు. ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12లోపు కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకునే వారికి లేదా ఇతర నెట్‌వర్క్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ తర్వాత ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని సంస్థ తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ వినియోగిస్తున్న ప్రస్తుత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ కాలంలో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 1GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, 100 ఉచిత SMSలు అందుబాటులో ఉంటాయి. కొత్తగా సిమ్ తీసుకునే వారితో పాటు ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారేవారికి కూడా ఈ ప్రయోజనాలు లభిస్తాయి.
No comments:
Post a Comment