షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతం : కారులో ముక్కలుగా లభించిన మృత దేహం : భార్య, కొడుకు మిస్సింగ్‌

Wednesday, September 23, 2026

Body Found Dismembered in Car; Wife and Son Missing karnataka national Tragic End to Indian Man's Mystery Case in Sharjah

t f B! P L

షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతంగా ముగిసింది. అతని మృతదేహం ఓ కారులో ముక్కలుగా లభించగా భార్య, కొడుకు కనిపించకుండా పోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. మృతుడ్ని కర్నాటకకు చెందిన అల్విన్‌ ప్రకాశ్‌ కుందర్‌గా అక్కడి అధికారులు నిర్దారించారు. ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్‌  గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పని చేస్తుండేవారు. భార్య, కొడుకుతో ఆయన అక్కడే జీవిస్తున్నారు. అయితే జూలై 20న అల్విన్‌కు ఆయన సోదరుడు అనిల్‌ ప్రశాంత్‌ కుందర్‌ ఫోన్‌ చేశారు. అల్విన్‌ కాల్‌ ఎత్తకపోగా, తాను బాగానే ఉన్నానంటూ మెసేజ్‌ పంపారు. సాధారణంగా వాయిస్‌ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అల్విన్‌ ఇలా టెక్స్ట్‌ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అల్విన్‌ నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఆయన స్నేహితుడికి అక్కడి వాచ్‌మన్‌ ఆయన భారత్‌కు వెళ్లిపోయారని చెప్పాడు. ఆయన పని చేసే కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కొన్నాళ్లు ఆగి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్‌ వివరాలను పరిశీలించారు. అల్విన్‌ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు. రెండు నెలల తర్వాత ఒమన్‌ వైపు వెళ్లే మార్గంలో పార్క్‌ చేసిన ఓ కారులో ఓ మృతదేహం లభించింది. అందులో మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచారు. పోస్టుమార్టం ద్వారా మృతదేహం అల్విన్‌దేనని నిర్ధారణ అయింది. హత్యకు కారణం ఏమిటి? ఎవరు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. అల్విన్‌ హత్య తర్వాత ఆయన భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసులో మరో ప్రశ్నగా మారింది. వాళ్లు షార్జా నుంచి భారత్‌కు వెళ్లి ఉండొచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యలో టీనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అల్విన్‌ సోదరుడు అనిల్‌ ఉడుపి ఎస్పీని కలిసి కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం కోసం ఉడుపి పోలీసులు ఎదురుచూస్తున్నారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్విన్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబం ప్రయత్నిస్తోంది. హత్య వెనుక కారణం, నిందితులెవరు, అల్విన్‌ భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది షార్జా దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టడం, హత్య తర్వాత అల్విన్‌ భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ లేకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ