ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఆదివాసీ సంప్రదాయ వేడుకల్లో భాగంగా పూజించిన చెట్టుకొమ్మను నదిలో నిమజ్జనం చేస్తుండగా ఐదుగురు గల్లంతయ్యారు ఆదివాసీ వేడుకల్లో భాగంగా పూజించిన చెట్టుకొమ్మను నదిలో నిమజ్జనం చేసేందుకు కొందరు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఐదుగురు నీటిలో గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక జాలర్లు వెంటనే నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపు గాలించిన అనంతరం ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. ఒకే ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉండటంతో కుటుంబ సభ్యుల ఆవేదన మరింత విషాదంగా మారింది.
చెట్టుకొమ్మను నదిలో నిమజ్జనం చేస్తుండగా ఐదుగురు గల్లంతు
Wednesday, September 23, 2026
Five go missing while immersing a tree branch in the river Jharkhand Palamu district three of the missing persons were minors traditional tribal ceremony
No comments:
Post a Comment