ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే సిద్ధిపేటలో తనపై పోటీకి రావాలంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. సిద్ధిపేటలో తనపై ఎవర్నో నిలబెట్టడం కాదు, నేరుగా సీఎం రేవంత్ పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. నీళ్ల విషయంలో నాడు-నేడు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, అసెంబ్లీ వేదికగా ఆధారాలు బయటపెడతా అని హరీష్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఫ్రస్టేషన్‌లో తన ఎత్తు గురించి, కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు తన ఎత్తు, కేటీఆర్ గడ్డం గురించి రేవంత్ మాట్లాడాల్సి అవసరం ఏంటని, ఇది ఫస్ట్రేషన్ కాక మరేమిటని ప్రశ్నించారు. కాగా, సిద్దిపేటలో నాలుగు దశాబ్దాలుగా 'మామ, అల్లుడు, బావమరిది' అంటూ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. 2029 ఎన్నికల్లో సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి, ఇక్కడి నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తామని సవాల్ విసిరారు. దీనిపై హరీష్ స్పందిస్తూ.. ఇక్కడ ఎవరో పోటీ చేసి గెలవడం ఎందుకు తనపై పోటీ చేసి సీఎం రేవంత్ గెలిచి చూపించాలని ప్రతి సవాల్ విసిరారు.
3
Beranda
› Congress party has betrayed the region regarding water issues
› Former Minister Harish Rao
› he should come to Siddipet and contest against me
› If Revanth Reddy has the guts
› telangana
› రేవంత్‌రెడ్డికి దమ్ముంటే సిద్ధిపేటలో తనపై పోటీకి రావాలి !
Subscribe to:
Post Comments (Atom)
