తమిళనాడు శాసనసభ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఎమ్మెల్యే వీఎస్ బాబు సెప్టెంబర్ 9న ఎంబీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఈ మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాలకు మరణించారని ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన తమిళనాడు కొళత్తూరు శాసనసభ నియోజకవర్గంలో డీఎంకే అధినేత స్టాలిన్‌పై 8వేల 795 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
3
Beranda
› defeated former Chief Minister M.K. Stalin
› Suffering from a long-term respiratory ailment
› Tamil Nadu Legislative Assembly elections
› TVK MLA V.S. Babu Passes Away
› టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత
Subscribe to:
Post Comments (Atom)
