3

మంగళగిరి ఎంపీడీవో ఆఫీసులో వైసీపీ వర్గపోరు : బీఫామ్ విషయంలో తీవ్ర వివాదం

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అంతర్గత వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. నవులూరు గ్రామానికి చెందిన 41వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న దొడ్డక కృష్ణ, తాడిబోయిన తాతారావు వర్గాల మధ్య బీఫామ్ విషయంలో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దొడ్డక కృష్ణ, ఆయన అనుచరులు తాడిబోయిన తాతారావు చేతిలో ఉన్న బీఫామ్ పత్రాన్ని లాక్కున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఘర్షణకు దారితీయడంతో రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే ఇరువర్గాల వారు పరస్పరం బాహాబాహీకి దిగినట్లు తెలిసింది. బీఫామ్ పత్రం కోసం కార్యాలయ ప్రాంగణంలోనే ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక సమయంలో ఒకే పార్టీకి చెందిన నాయకులు, అభ్యర్థులు బహిరంగంగా ఘర్షణకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో వైఎస్సార్‌సీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కార్యాలయానికి వచ్చిన ప్రజలు, ఇతర అభ్యర్థులు ఈ ఘటనతో ఆందోళనకు గురయ్యారు.

Related Post

Previous
Next Post »