దేశీయ మార్కెట్లోకి లావా స్మార్ట్ 4 ప్రో విడుదలైంది. భారీ బ్యాటరీ, మెరుగైన డిస్‌ప్లే, కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ దీని ప్రధాన ఆకర్షణలు. ముఖ్యంగా 7,000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఒకే వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. 4GB RAM, 64GB స్టోరేజ్ కలిగిన ఈ మోడల్ ధర రూ.10,999. నీలం బ్లూ, కోణార్క్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లావా అధీకృత ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. Unisoc T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB ఫిజికల్ RAMతో పాటు మరో 4GB వరకు వర్చువల్ RAM విస్తరణ సదుపాయం ఉంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డు ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు. ఇది 7,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగివుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు USB Type-C పోర్ట్ కూడా ఉంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి ఈ బ్యాటరీ ఉపయోగకరంగా ఉండనుంది. లావా ప్రకారం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 950 గంటల వరకు స్టాండ్‌బై సమయం, 748 నిమిషాల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ అందించగలదు. దీని వెనుకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫోన్ Android 16 ఆధారంగా పనిచేస్తుంది. ఎలాంటి అనవసర యాప్స్, ప్రకటనలు లేని క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే MIL-STD-810H డ్రాప్, షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది. రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తంగా రూ.10,999 ధరలో భారీ బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే కోరుకునే వినియోగదారుల కోసం Lava Smart 4 Proను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
3
Beranda
› 4GB RAM
› 6.75-inch HD+ LCD display
› 64GB Storage
› 7000mAh battery
› Blue and Konark Gold
› Lava Smart 4 Pro Launched
› లావా స్మార్ట్ 4 ప్రో విడుదల : 7,000mAh బ్యాటరీ, 4GB RAM, 64GB స్టోరేజ్
Subscribe to:
Post Comments (Atom)
