3

పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 90 శాతం వరకు నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు ఆమోదం

ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారులు ప్రావిడెంట్ ఫండ్ నుంచి నగదు ఉపసంహరించుకునే నిబంధనలను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన కనీస నిల్వను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 90 శాతం వరకు నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. గతంలో అత్యవసర అవసరాల కోసం నగదు ఉపసంహరించుకున్నప్పటికీ, ఖాతాలో కనీసం 25 శాతం మొత్తాన్ని నిల్వ ఉంచుకోవాల్సిన నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని తగ్గించడం ద్వారా ఉద్యోగులకు తమ పొదుపు మొత్తంపై మరింత వెసులుబాటు లభించనుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగులకు అనేక సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, వైద్య చికిత్సలు, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు పీఎఫ్ నగదును ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత జీవన విధానంలో ఆకస్మిక ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు తమ సొంత పొదుపు మొత్తాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకోవడానికి ఈ ప్రతిపాదన దోహదపడనుంది. ఖాతాలో 10 శాతం మాత్రమే కనీస నిల్వగా ఉంచాల్సి రావడంతో మిగిలిన మొత్తాన్ని అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. 

Related Post

Previous
Next Post »