వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. టాప్ ఆర్డర్ మొత్తం భారీగా పరుగులు సాధిస్తున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (136) సూపర్ సెంచరీతో కదంతొక్కగా, యశస్వి జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. నాలుగో నంబర్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ 78 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తుండగా.. అతడికి జతగా రిషబ్ పంత్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 414-3గా ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌పై భారత్ 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్ (175 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (118) సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో బుమ్రా 4, ఆకాశ్‌దీప్ 3, అన్షుల్ కంబోజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు వ్యక్తిగతంగా, జట్టుగా పలు పాత రికార్డులు బద్దలు కొట్టి, కొన్ని కొత్త రికార్డులు సెట్ చేశారు. ఈ క్రమంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 175 బంతుల్లో 80 పరుగులు చేసిన పడిక్కల్ కూడా ఓ రికార్డును బ్రేక్ చేశాడు. సెంచరీకి చేరువగా వచ్చి ఔటైనప్పటికీ.. భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును అధిగమించాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన జాబితాలో రెండో స్థానానికి చేరాడు. గతంలో ఈ స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు.
3
Beranda
› 1st Test: Indian top-order piles up big runs
› cricket
› first Test against New Zealand in Wellington
› India vs New Zealand
› Padikkal breaks Dravid’s record
› sports
› భారత్ - న్యూజిలాండ్ తొలి టెస్ట్ : భారీగా పరుగులు సాధిస్తున్న భారత్ టాప్ ఆర్డర్
Subscribe to:
Post Comments (Atom)
