హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేప్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు క్యూర్ ప్రాంతంలో నిన్న విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో మొత్తం 8 ప్రత్యేక బృందాలు తొమ్మిది హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి సరైన నిబంధనలు పాటించని నాలుగు హోటళ్ల లైసెన్స్ లు రద్దు చేయడంతో పాటు మరో రెండింటిని సీజ్ చేశారు. ది స్పైస్ కిచెన్ (కూకట్‌పల్లి), రాజు గారి బిర్యానీ (చైతన్యపురి), స్వాద్ స్పైసీ (నాగోల్), మాదాపూర్ బావర్చి (అయ్యప్ప సొసైటీ), మెహఫిల్ రెస్టారెంట్ (బల్కంపేట్), అన్నపూర్ణ క్యాటరర్స్ (చందానగర్), మతామ్ అల్ యమాని అరేబియన్ రెస్టారెంట్ (టోలీచౌకి), అల్ కరీం బేకర్స్ (టోలీచౌకి), శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్ (గౌలిదొడ్డి) లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించిన మాధాపూర్ అయ్యప్ప సొసైటీలోని మాధాపూర్ బావర్చి, కూకట్‌పల్లిలోని ది స్పైస్ కిచెన్, టోలిచౌకిలోని మాతమ్ అల్ యమానీ అరేబియన్ రెస్టారెంట్, చందానగర్‌లోని అన్నపూర్ణ క్యాటరర్స్ హోటళ్ల లైసెన్సులు సస్పెండ్ చేశారు. లైసెన్సులు పునరుద్ధరించే వరకు వీటిని స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించనున్నారు. టోలీచౌకిలోని అల్ కరీం బేకర్స్, గౌలిదొడ్డిలోని శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్లను అధికారులు మూసివేయగా అలాగే బల్కంపేట్‌లోని మెహఫిల్ రెస్టారెంట్కు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు.
3
Beranda
› Licenses of Four Hotels Cancelled
› telangana
› Telangana Food Safety and Drug Control Department conducted extensive inspections
› Two Others Seized in Hyderabad
› హైదరాబాద్ లో నాలుగు హోటళ్ల లైసెన్స్ లు రద్దు, మరో రెండింటిని సీజ్
Subscribe to:
Post Comments (Atom)
