హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన 'ఎక్స్' వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న బ్రాండ్ హైదరాబాద్‍ను ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలతో ఎంతో కష్టపడి నిర్మించామని కేటీఆర్ గుర్తు చేశారు. నగరంలోని మెటా కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని కాంగ్రెస్ గూండాలు ఏదో గొప్ప పనిగా భావిస్తున్నారని, ఆ మూర్ఖులు దాని గురించి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గడిచిన మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని మెటా లాంటి ఒక్క పెద్ద కంపెనీనైనా హైదరాబాద్‌కు తీసుకురాగలిగారా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ.. దేశంలోకి కంపెనీలను తీసుకొచ్చే మీ విధానం ఇదే విధమైన గూండాయిజమా? అని నిలదీశారు. భారత్‌లోనే మెటాకు అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని, తాము సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇవ్వడం వల్లే ఆ సంస్థ మన నగరాన్ని ఎంచుకుందని కేటీఆర్ ట్వీట్‍లో పేర్కొన్నారు. నిన్న జరిగిన దాడిలో కేవలం ఆఫీసు అద్దాలు మాత్రమే పగలలేదని, బ్రాండ్ హైదరాబాద్‍పై ఉన్న నమ్మకం కూడా బద్దలైందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
3
Beranda
› Gachibowli
› hyderabad
› KTR slams the incident on 'X'
› says it damages 'Brand Hyderabad'
› telangana
› Youth Congress workers attack Meta office
› మెటా ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి : బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీశారంటూ 'ఎక్స్' వేదికగా కేటీఆర్
Subscribe to:
Post Comments (Atom)
