ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నసీం దుర్రానీ హతమయ్యాడు. ఢిల్లీ పోలీసులు, నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కపిల్ మిశ్రా కార్యాలయం బయట సమీర్ అనే యువకుడిని కాల్చి చంపిన హత్య కేసులో నసీం దుర్రానీ ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత పోలీసు బృందాలు అతడి కదలికలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో అతను బులంద్‌షహర్‌లో ఉన్నట్లుగా పక్కా సమాచారం అందడంతో, సంయుక్త బృందం అక్కడికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించింది. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో నసీం దుర్రానీ మృతి చెందాడు. గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌ను హతమార్చేందుకు జరిగిన కుట్రలోనూ నసీం దుర్రానీ పాత్ర ఉందని, ఈ పని కోసం సుపారీ కూడా తీసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
3
Beranda
› alleged to be involved in the murder of a youth named Sameer
› Bulandshahr
› Gangster Naseem Durrani killed in an encounter
› Uttar Pradesh
› ఎన్‌కౌంటర్ లో గ్యాంగ్‌స్టర్ నసీం దుర్రానీ హతం
Subscribe to:
Post Comments (Atom)
