పంజాబ్‌లోని పాటియాలా-సంగ్రూర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. భాక్రా కాలువపై నిర్మించిన ఒక ఇనుప వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదే సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న రెండు భారీ లారీలు వంతెనతో పాటు కిందకు కాలువలో పడిపోయి వేలాడుతున్నాయి. ప్రమాద తీవ్రతకు ఆ రెండు లారీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలో వేలాడుతూ మంటల్లో చిక్కుకున్న లారీల నుంచి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదృష్టవశాత్తూ రెండు లారీల డ్రైవర్లను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి కాపాడాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కూలిపోయిన వంతెన పైభాగం నుంచి భాక్రా కాలువ నీరు ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పక్కనే ఉన్న మరో వంతెన ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు. కాగా, ఈ జాతీయ రహదారి మరియు వంతెనను 2016లో నిర్మించారు. గతంలోనే ఈ వంతెనపై పగుళ్లు వచ్చినట్లు వార్తలు రాగా, దీనికి తోడు లారీల్లో ఓవర్‌లోడ్ ఉండటం వల్లే బరువు తట్టుకోలేక కూలిపోయిందా? లేక నిర్మాణ లోపమా? అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. పదేళ్లు కూడా నిండక ముందే వంతెన కూలిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
3
Beranda
› bridge collapsed less than ten years after its construction
› Iron Bridge Collapses in Punjab; Two Lorries Catch Fire
› national
› Officials Relieved as No Lives Lost
› Patiala-Sangrur National Highway
› పంజాబ్‌లో కుప్పకూలిన ఇనుప వంతెన : రెండు లారీలకు అంటుకున్న మంటలు : ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
Subscribe to:
Post Comments (Atom)
