3

అమెరికాలో మునుగోడు యువకుడు దుర్మరణం

అమెరికాలో కారుకు జింక అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన యువకుడు మృతి చెందాడు. మునుగోడు పట్టణానికి చెందిన సాయితేజ (25), ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. వారం రోజుల క్రితమే అతనికి ఉద్యోగం కూడా వచ్చింది. సాయితేజ కారు నడుపుతుండగా అకస్మాత్తుగా ఒక జింక రోడ్డుపైకి వచ్చింది. జింకను ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది.అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వాహనాలు సాయితేజ కారును బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related Post

Previous
Next Post »