దేశీయ మార్కెట్‌లో ఇప్పటికే బోల్డ్ ఇండిగో కలర్‌లో అందుబాటులో ఉన్న ఐటెల్ సిటీ 300 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు డార్క్ రూబీ, మిస్ట్ బీగ్ కలర్ వేరియంట్లలో విడుదల అయింది. బడ్జెట్ ధరలో 5G కనెక్టివిటీతో పాటు 120Hz డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. గతంలో ఈ ఫోన్ Bold Indigo కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు కంపెనీ మరో రెండు కొత్త రంగులను పరిచయం చేసింది.ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. డిస్‌ప్లే 720 × 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. దీంతో స్క్రోలింగ్, యాప్స్ వినియోగం, ఇతర సాధారణ పనులు మరింత స్మూత్‌గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా కోర్ UNISOC T8200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ స్మార్ట్‌ఫోన్ వినియోగం, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనుల కోసం అందించారు. ఈ ఫోన్ Android 16 Go Edition ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ ఆటో ఫోకస్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సాధారణ ఫొటోగ్రఫీ, వీడియో కాలింగ్ అవసరాలకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. దీనిలో 5000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. ఇది 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వినియోగదారుల భద్రత కోసం ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. అలాగే Face Unlock ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5G, డ్యూయల్ సిమ్, Wi-Fi, Bluetooth 5.0, GPS, 3.5mm ఆడియో జాక్, USB Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
3
Beranda
› 120Hz display
› a 13-megapixel camera
› and a 5000mAh battery
› itel S23 5G Smartphone Launched in Dark Ruby and Mist Beige Color Variants
› technology
› డార్క్ రూబీ, మిస్ట్ బీగ్ కలర్ వేరియంట్లలో విడుదలైన ఐటెల్ సిటీ 300 5జీ స్మార్ట్‌ఫోన్
Subscribe to:
Post Comments (Atom)
