భూమి వైపుగా ఐదు గ్రహశకలాలు దూసుకువస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో భూమి సమీపం నుంచి ఈ గ్రహశకలాలు ప్రయాణించనున్నట్లు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 10 మీటర్ల నుంచి గరిష్టంగా 120 మీటర్ల పరిమాణంలో కలిగిన ఈ అంతరిక్ష శిలలను ఖగోళ శాస్త్రవేత్తలు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఈ ఐదు గ్రహశకలాలకు 2026 VA11, 2026 TB84, 2026 VD6, 2018 NE1, 2007 WK3 అని పేర్లు పెట్టారు. ఈ ఐదు కూడా భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదని అంచనా వేస్తున్నారు. ఈ ఐదింటిలో 2026 VA11 గ్రహశకలం భూమికి అత్యంత దగ్గర నుంచి ప్రయాణిస్తుంది. ఇది నవంబర్ 19న భూమికి సుమారు 33.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. భూమి చంద్రుడి మధ్య దూరంతో పోలిస్తే ఇది దాదాపుగా 8.72 రెట్లు ఎక్కువ. ఈ గ్రహశకలం వెడల్పు సుమారు 10 నుంచి 22 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది సెకనుకు సుమారు 8.9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. భూమి వైపు వస్తున్న గ్రహశకలాల్లో పెద్దది 2026 TB84. దీని వ్యాసం సుమారు 50 నుంచి 110 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా. నవంబర్ 19, 20న భూమికి 46.4 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది ప్రయాణిస్తుంది. మిగిలిన మూడు గ్రహశకలాలు నవంబర్ 20న భూమిని దాటి వెళ్లనున్నాయి. 2018 NE1 అనే గ్రహశకలం నవంబర్ 19న భూమికి సుమారు 63.8 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. దీని వ్యాసం 50 నుంచి 120 మీటర్లు ఉంటుందని అంచనా. ఈ ఐదింటిలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఇదే. ఇది సెకను సుమారు 13.3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. 2007 WK3 నవంబర్ 19న భూమికి సుమారు 54.7 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది. దీని వ్యాసం సుమారు 14 నుంచి 30 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా. 2026 VD6 నవంబర్ 20న భూమికి దగ్గరగా రానుంది. ఇది భూమికి సుమారు 40.1 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. దీని వ్యాసం 12 నుంచి 28 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా.
3
Beranda
› Five Asteroids Heading Toward Earth
› science
› technology
› To Pass Near the Planet in the Next 48 Hours
› భూమి వైపు దూసుకొస్తున్న ఐదు గ్రహశకలాలు : రాబోయే 48 గంటల్లో భూమి సమీపం నుంచి గ్రహశకలాలు ప్రయాణం
Subscribe to:
Post Comments (Atom)
