Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి టూరిజంలోనే పోస్టింగ్ కేటాయించింది. ఏపీ క్యాడర్‌లో అన్యమనస్కంగానే పని చేస్తున్న అమ్రపాలి సుదీర్ఘ కాలం సెలవు పెట్టారు. సెలవు పూర్తయిన తర్వాత కూడా ఆమె రిపోర్ట్ చేయలేదు. దాంతో గతంలో ఆమెను పోస్టింగ్ లేని బదిలీ చేశారు. ఇప్పుడు తాను మళ్లీ విధుల్లో చేరుతానని విజ్ఞప్తి చేయడంతో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ కేటాయించారు. ఇంతకు ముందు ఆమె ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పని చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ ఆమెకు అదే టూరిజం రంగానికి సంబంధించిన శాఖలోనే కార్యదర్శి స్థాయి పదవిని కేటాయించింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆధ్వర్యంలో ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. రాష్ట్రంలో కొత్త టూరిజం ప్రాజెక్టులు, తీర ప్రాంత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ఆమె పని చేయనున్నారు. తెలంగాణ క్యాడర్ కు వెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించారు. కానీ తాను తెలంగాణలోనే ఉంటానని..తన స్థానికత తెలంగాణ అని క్యాట్ నుంచి కోర్టు వరకూ పోరాడారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దాంతో తప్పనిసరిగా ఏపీలో రిపోర్టు చేశారు. కానీ ఇంకా ఆమె తెలంగాణకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement