Travel the world
Climb the mountains
and other western partsbusinessCRE Matrix ReporthyderabadKokapetlike GachibowliRecord-breaking new project launches alongside 1.42 lakh unsold flatstelanganaTellapur
హైదరాబాద్ లో ఒకవైపు రికార్డు స్థాయిలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం : మరో వైపు అమ్ముడుపోని 1.42 లక్షల ఫ్లాట్లు : క్రి మ్యాట్రిక్స్ నివేదిక
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఒకవైపు రికార్డు స్థాయిలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కొనసాగుతుండగానే, మరోవైపు అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనాసిస్ సంస్థ క్రి మ్యాట్రిక్స్' విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, నగరంలో కొత్త ఫ్లాట్ల లాంచ్‌లు ఏకంగా 120 శాతం పెరిగినప్పటికీ, మార్కెట్లో దాదాపు 1.42 లక్షల ఫ్లాట్లు కొనుగోలుదారులు లేక అమ్ముడుపోకుండా మిగిలిపోయాయని సంచలన విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా గచ్చిబౌలి, తెల్లాపూర్, కోకాపేట, ఇతర పశ్చిమ నగర పరిసరాల్లో లగ్జరీ, హై-రైజ్ ప్రాజెక్టులను బిల్డర్లు భారీగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు , ఐటీ రంగానికి చెందిన నియామకాల మందగమనం వల్ల ప్రాథమిక కొనుగోలుదారైన ఐటీ ఉద్యోగుల నుంచి కొనుగోలు వేగం ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ ఇన్వెంటరీ పెరిగిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడం, భూముల ధరలు అమాంతం పెరగడం వల్ల బిల్డర్లు సరఫరాను విపరీతంగా పెంచేసినప్పటికీ, దానికి తగినట్లుగా డిమాండ్ పుంజుకోకపోవడంతో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రాజెక్టులు నిర్మిస్తున్న డెవలపర్లపై ఆర్థిక భారంగా మారడంతో పాటు, భవిష్యత్తులో ధరల స్థిరీకరణకు లేదా కొత్త లాంచ్‌ల నెమ్మదించడానికీ దారితీసే అవకాశాలు ఉన్నాయి. అయితే, రాత్రికి రాత్రే ఇళ్లు అమ్ముడుపోకపోవడం వల్ల క్రమంగా మార్కెట్ కొనుగోలుదారుల అనుకూల మార్కెట్ గా మారే అవకాశం ఉందని మార్కెట్ రంగానికి చెందిన భావిస్తున్నారు. బిల్డర్లు నిల్వ ఉన్న ఇన్వెంటరీని వదిలించుకునేందుకు ప్రాజెక్టుల ధరలను స్థిరీకరించడం, సడలింపులు ఇవ్వడం లేదా నూతన ఆఫర్లు ప్రకటించడం ద్వారా రాబోయే రోజుల్లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment