3

ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి : లబ్ధిపొందనున్న కోటికిపైగా కుటుంబాలు

తెలంగాణ రాష్ట్రంలోని కోటికిపైగా కుటుంబాల కోసం ఉద్దేశించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిద్దిపేటలో గురువారం ప్రారంభించారు. ఈ పథకం కోసం అన్ని జిల్లాల్లో శుక్రవారంనుంచి దరఖాస్తు ఫారాలను స్వీకరించనున్నారు. ఇందిరమ్మ జీవిత బీమా కింద ప్రతి కుటుంబంలో సంపాదించే ఒక వ్యక్తి పేరిట బీమా నమోదు చేస్తారు. కుటుంబంలో ఒకరికి మించి సంపాదిస్తున్నా ఒకరికే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరిని నమోదు చేయించాలనేది కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవాలి. ఆ వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల సాయాన్ని కుటుంబానికి అందిస్తారు. ప్రతి కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన (1967 నవంబరు 19 నుంచి 2008 నవంబరు 18 మధ్య జన్మించిన వారు) సంపాదించే వ్యక్తులలో ఒకరిని నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనన ధ్రువీకరణకు ఆధార్‌ కార్డులోని తేదీని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ ఈ నెల 19 నుంచి డిసెంబరు 18 లోపు పూర్తి చేయాలని నిర్దేశించింది. నమోదు పూర్తయిన తర్వాత బీమా పొందిన వ్యక్తి ఆ కాలంలో గరిష్ఠ వయోపరిమితిని దాటినా కనీసం ఒక సంవత్సరంపాటు పూర్తి బీమా కవరేజీ పొందుతారని పేర్కొంది. అర్హత కలిగిన ప్రతి కుటుంబం సులభంగా పథకంలో చేరేలా సహాయక నమోదు శిబిరాలు నిర్వహించాలి. శిబిరాల నిర్వహణకు రెండు రోజుల ముందు నుంచే గ్రామాలు, వార్డుల్లో దండోరా వేయించడంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, నగరాలు/పట్టణాల్లో వార్డు అధికారి శిబిరం ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. ఆయనతోపాటు ఒక హెల్ప్‌ డెస్క్ ఇన్‌చార్జి కూడా ఉంటారు. పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న ఆహారభద్రత కార్డుల డేటా ఆధారంగా నిర్ణీత నమూనాలో వ్యక్తుల వివరాల నమోదు జరగాలి. ఆ డేటాలో పేర్లు నమోదు కాని, రేషన్‌ కార్డు లేని వారి కోసం విడిగా మరో దరఖాస్తు ఫారం ఇస్తారు. అందులో బీమా పొందే సభ్యుని వివరాలు, ఆధార్‌ ఆధారిత జనన తేదీ, కుటుంబ వివరాలు, నామినీ వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు ఫారం సంఖ్యగా రేషన్‌ కార్డు సంఖ్యను ఉపయోగించాలి. రేషన్‌ కార్డు లేని కుటుంబాలకు ప్రత్యేక కోడ్‌ కేటాయించాలి. ఇతర జిల్లాకు చెందిన రేషన్‌ దరఖాస్తు ఫారం సంఖ్యగా రేషన్‌ కార్డు సంఖ్యను ఉపయోగించాలి. రేషన్‌ కార్డు లేని కుటుంబాలకు ప్రత్యేక కోడ్‌ కేటాయించాలి. ఇతర జిల్లాకు చెందిన రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలు కూడా సమీప శిబిరంలో నమోదు చేసుకోవచ్చు. ఒకరి కంటే ఎక్కువమంది నామినీలు ఉన్నప్పుడు వారికి రూ.5 లక్షల్లో క్లెయిమ్‌ వాటాలు ఎలా వర్తిస్తాయో నమోదు సమయంలో అధికారులు స్పష్టంగా వివరించాలి. రాష్ట్ర స్థాయిలో హెల్ప్‌ డెస్క్‌, జిల్లాల్లో హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

Related Post

Previous
Next Post »