ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోతోపాటు నోయిడా, ఘజియాబాద్, మీరట్, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాల్లో కూడా విద్యుత్ కోతలు అధికంగా ఉన్నాయి. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. బుధవారం లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. విద్యుత్ మంత్రి ఏకే శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీరట్, ప్రయాగ్‌రాజ్, సీతాపూర్‌లో కూడా స్థానికులు నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు మే 27న లక్నోలోని రాజాజీపురంలో ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పలు గంటలపాటు విద్యుత్ నిలిచిపోయింది. ఆగ్రహించిన స్థానికులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. పవర్ హౌస్‌లోకి ప్రవేశించి కంప్యూటర్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
0 Comments