మాచర్ల ఎమ్మెల్యే కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు!


ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి మూడు కేసుల్లో వచ్చే నెల 6వ తేదీ వరకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కొన్ని షరతులు విధించింది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రతి రోజూ ఎస్పీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 4వ తేదీన మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లవచ్చునని తెలిపింది. ఆ రోజున రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కావడంతోనే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. జూన్ 6వ తేదీన మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచెర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకం సృష్టించారు. ఎన్నికల పోలింగ్ సమయంలో పలు చోట్ల దాడులకు, విధ్వంసానికి పాల్పడ్డారు. పాల్వయ్ గేట్ గ్రామంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ ఏజెంట్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు పిన్నెల్లి. ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో పది సెక్షన్ల కింద కేసు నమోదవగా.. టీడీపీ ఏజెంట్‌పై దాడి, ఓ పోలీస్ అధికారిపై దాడి.. మరొకరిని బెదిరించిన నేపథ్యంలో పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 

No comments:

Post a Comment

3