ఆస్ట్రేలియాలో భారత-ఏ క్రికెట్ జట్టు పర్యటించనుంది. అక్టోబర్ 31-నవంబర్ 10 మధ్యలో ఆస్ట్రేలియా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు జరుగనుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు టీమిండియాతో కూడా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15-17 మధ్యలో జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టు ఆడే రెండు మ్యాచ్‌లకు ఫస్ట్ క్లాస్ హోదా లభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులు కొందరు ఈ సిరీస్‌లో పాల్గొంటారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుందని సీఏ తెలిపింది. ఈ పర్యటన కోసం జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. భారత్-ఏతో సిరీస్ పక్కా అయిన విషయాన్ని మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.స్వదేశంలో జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
by Telugu Lo Computer at May 28, 2024
Labels:
cricket
,
sports
,
అక్టోబర్ 31-నవంబర్ 10 మధ్య
,
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
,
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment