పసిఫిక్ మహాసముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వింత ఆకారం !

సిఫిక్ మహాసముద్ర తీరానికి ఓ వింత జీవి కొట్టుకొచ్చింది. అది అచ్చం 'ఫైండింగ్ నెమో' చిత్రంలోని చేప మాదిరి ఉండటంతో దాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై స్థానిక మెరైన్ మ్యూజియం సీసైడ్ అక్వేరియం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. '2000-3300 అడుగుల సముద్రపుటడుగున నివసించే ఈ చేపను మనుషులు చాలా అరుదుగా చూసి ఉంటారు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఈ చేపకు సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా 31 జాతులను కనుగొన్నామన్నారు. పసిఫిక్ ఫుట్‌బాల్ చేప అని పిలవబడే దీనిని న్యూజిలాండ్, జపాన్, రష్యా, హవాయి, ఈక్వెడార్, చిలీ, కాలిఫోర్నియా వంటి దేశాలు చూశామన్నారు. ఈ జాతికి చెందిన జీవరాశుల్లో మగ, ఆడ అనే తేడా కనుగొనడం కష్టమని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక ఈ చేపలు తమ ఎరను పట్టుకునేందుకు నుదిటిపై ఫాస్ఫోరేసెంట్ బల్బుల నుండి కాంతిని వినియోగిస్తాయని చెప్పుకొచ్చారు.ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org