ప్రయాణికులకు చుక్కలు చూపిన ఎయిరిండియా !


ఢిల్లీలోఎయిరిండియా విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించింది. ఓ వైపు హస్తినలో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాలిసిన ఎయిరిండియా విమాన ప్రయాణం ఏకంగా 20 గంటలు ఆలస్యం కావడం, 8 గంటల పాటు ఎయిర్ కండిషన్ లేని విమానంలోకూర్చోబెట్టడంతో ప్యాసింజర్స్ ఉక్కపోత, వేడితో అల్లాడిపోయారు. చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, నిన్న మధ్యాహ్నం టేకాఫ్ కావాల్సిన శాన్ ఫ్రాన్సిస్కో విమానం 20 గంటల ఆలస్యం తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరనున్నట్టు అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం