జూన్ 1న జరిగే చివరి విడత పోలింగ్‌కు ఇవాళ్టి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికలతో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ ప్రచారంలో దూకుడు సాగించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేపట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ రెండున్నర నెలల్లో ప్రధాని దాదాపు 180 ర్యాలీలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి ఈ 75 రోజుల్లో ప్రధాని దేశం నలుమూలలా ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. 22 రోజుల పాటు నిత్యం నాలుగు చోట్ల ప్రచారాలు నిర్వహించారు. మూడు పర్యాయాలు అయితే ఒక్క రోజులోనే ఐదేసి సభలు నిర్వహించారు. ఈ మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. వాటిలో యూపీ, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టారు. ఇక దక్షిణాదిలో ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు.
0 Comments