తెలంగాణలో మరికొద్ది రోజులపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.తెలంగాణలోని పలు జిల్లాలకు సోమవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారింది. ఆదివారం సాగర్ ఐలాండ్ వద్ద తుఫాన్ తీరం దాటింది. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట్, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు సోమవారం వర్ష కురిసే అవకాశం ఉంది. 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఆ తర్వాత రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ !
by Telugu Lo Computer at May 27, 2024
Labels:
telangana
,
weather
,
ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
,
తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ
,
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment