తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని గడ్డిపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈటీపీ సెక్షన్ లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటికి పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. భారీగా పొగలు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటలు చెలరేగిన పరిశ్రమలో ఎవరైనా కార్మికులు చిక్కుకున్నారా... లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. హెటిరో ల్యాబ్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది.

0 Comments